ఐఓఎస్‌ 12 వచ్చేసింది…

0
207

టెక్‌ దిగ్గజం ఆపిల్‌ తన అభిమానులకు శుభవార్త చెప్పేసింది. ఎంతో కాలంగా వేచిచూస్తున్న ఐఓఎస్‌ 12ను ఆపిల్‌ ఎట్టకేలకు విడుదల చేసింది. కాలిఫోర్నియాలోని శాన్‌జోస్‌లో జరుగుతున్న వరల్డ్ వైడ్‌ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌లో‌(డబ్ల్యూడబ్ల్యూడీసీ) ఈ అప్‌డేట్‌ను కంపెనీ ప్రవేశపెట్టింది. లక్షల కొద్దీ ఐఫోన్లు, ఐప్యాడ్లు మరింత సమర్థవంతంగా పనిచేయడం కోసం ఈ ఐఓఎస్‌ 12ను విడుదల చేయడంతో పాటు సరికొత్త ఫీచర్స్‌ను కూడా తీసుకొచ్చింది. ఈ ఐఓఎస్‌ 12 బగ్స్‌ను ఫిక్స్‌ చేయడంతోపాటు ఐఫోన్‌, ఐప్యాడ్ల పనితీరును మెరుగుపరుస్తుందని కంపెనీ చెప్పింది. ఐఓఎస్‌ 12తో ముందు అనుభవించలేని సరికొత్త అనుభూతిని అందించనున్నామని ఆపిల్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ క్రైగ్ ఫెడెర్గి చెప్పారు.

మరింత వేగం, మరింత రెస్పాన్సివ్‌ : ఐఫోన్‌ 5ఎస్‌తో పాటు సిస్టమ్స్‌ అన్నింటిలోనూ మెరుగైన పనితీరుపై ఇది ఎక్కువగా ఫోకస్‌ చేసింది. ఐఓఎస్‌ 12తో కెమెరాను 70 శాతం వరకు, కీబోర్డ్‌ 50 శాతం వరకు వేగవంతం చేసింది.

ఫోటో సెర్చ్‌ మెరుగుపరచడం : ఫోటోయాప్‌ అంతాకొత్తగా ‘ఫర్‌ యూ’ అనే ట్యాబ్‌ను కలిగి ఉంటుంది. ఇది మెమరీస్‌, ఐక్లౌడ్‌ షేర్డ్‌ అల్బామ్స్‌ నుంచి ఇష్టమైన క్షణాలన్నింటిన్నీ ఒకచోటికి చేరుస్తోంది. ఈ ఫీచర్‌తో స్నేహితులతో తేలికగా ఫోటోలను షేర్‌ చేసుకోవచ్చు. అదేవిధంగా స్నేహితులు అదే ఈవెంట్‌కు సంబంధించి తిరిగి వీడియోలను, ఫోటోలను షేర్‌ చేయవచ్చు.

స్ర్కీన్‌ టైమ్ : అందరూ ఊహించినట్లే డిజిటల్‌ హెల్త్‌ ఫీచర్‌ను ఐఓఎస్‌12లో పొందుపర్చారు. దీనివల్ల యాప్స్‌, వెబ్‌సైట్స్‌పై మీరు వెచ్చించే సమయాన్ని ఈ ఫీచర్‌ కంట్రోల్‌ చేస్తుంది. ఒక్కో యాప్‌పై మీరు ఎంత సమయం వెచ్చించారో గంటవారీ, రోజువారీ, వారంవారీగా డేటా తెలుపుతుంది.

ప్రైవసీ అండ్‌ సెక్యూరిటీ : ఆపిల్‌ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్‌, మెరుగైన ప్రైవసీ అండ్‌ సెక్యూరిటీకి ఐఓఎస్‌ 12 అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది. సఫారీలో ఇంటెలిజెన్స్‌ ట్రాకింగ్‌ ప్రివెన్షన్‌ ఆప్షన్‌తో మీరు సోషల్‌ మీడియా లైక్‌ లేదా షేర్‌ బటన్స్‌ను బ్లాక్‌ చేయొచ్చు.

మెమోజీ, ఫన్‌ కెమెరా ఎఫెక్ట్స్‌ : గత ఏడాది అనిమోజీని ప్రవేశపెట్టిన ఆపిల్‌ ఈసారి మెమోజీలను ప్రవేశపెట్టింది. ఇది అచ్చం శాంసంగ్‌ ఏఆర్‌ ఎమోజీలాగానే ఉంది.

మెజర్‌ యాప్‌ : కొత్త యాప్‌ ఇది. వస్తువులు, గోడల కొలతలను ఈ ఫీచర్‌తో కొలవవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here