సినీ నటి భూమి కబ్జా …

594

ఈమధ్య అంధ్రప్రదేశ్ లో భూకబ్జాలు ఎక్కువయ్యాయి  . ఈ విషయంలో సినీనటులు కూడా మినహాయింపు కాదు  . తాజాగా తెలుగు సినీనటి తన భూమిని కబ్జా చేసారంటూ పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు . వివారాలలోకి వెళితే నటి అపూర్వ ఈ విషయం గురుంచి మాట్లాడుతూ తనకు పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు లో తనకు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉందని , ఇటీవలే తన భూమిని సర్వేయర్ తో సర్వే చేయించి సరిహద్దులో రాళ్ళు పాతించామని చెప్పారు . మరుసటి రోజే చుట్టు పక్కల ఉన్న రైతులు ఆ రాళ్ళను తొలగించి , భూమిని ఆక్రమించారని తెలిపారు . ఈ కబ్జా వ్యవహారం పై పోలీసులు మాట్లాడుతూ ఇది సివిల్ వ్యవహారమని , భూమి సరిహద్దుల విషయాన్ని ఎమ్మార్వో చూసుకుంటారని , రెవిన్యూ అధికారులతో మాట్లాడి , సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here