ప్రముఖ నటి సుధ ఇటీవల ఆలీ హోస్ట్ గా నిర్వహిస్తున్న ఒక టీవీ కార్యక్రమంలో పాల్గొన్నారు . ఆమె తన జీవితం గురుంచి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు . ఈ సందర్భంగా ఆలీ అడగగా దానికి సమాధానంగా ఉదయ్ కిరణ్ తనకు ఉన్న అనుభంధం గురుంచి సుధ పంచుకున్నారు .
ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు ముందు ఎలా ఉండేవారు అనేదానిపై ఆమె మాట్లాడుతూ ‘‘ఉదయ్‌కిరణ్ హీరో కాకముందు నుంచే నాకు తెలుసు. చాలా సినిమాల్లో వాడికి అమ్మగా నటించా. చాలా మంచి వాడు. ఎవరికైనా సహయం చేయలని చూసేవాడు. ఉదయ్ కిరణ్‌ను నేను దత్తత తీసుకోవాలని భావించాను కానీ ఈ లోపే వాడు సూసైడ్ చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు ఉదయ్ కిరణ్ చాలా డల్‌గా ఏదో పొగొట్టుకున్నావాడిలా ఉండేవాడు. నేను ఓ రోజు పిలిచి అడిగితే మీతో చాలా చెప్పాలి అమ్మ అన్నాడు. కానీ ఇప్పుడు కాదు నేనే మన ఇంటికి వస్తాను అన్నాడు. అలా చెప్పిన కొన్ని రోజులకే ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయ్ చనిపొతే నా సొంత కొడుకు చనిపోయినట్లు ఉంది. ఒకవేళ నేను దత్తత తీసుకుని ఉంటే ఇలా జరిగేది కాదేమో’’ అని కన్నీటి పర్యంతమయ్యారు సుధ.