కడప జిల్లా జమ్మలమడుగు మండలం పెద్దదండ్లూరు శివారులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏపీ మంత్రి ఆది నారాయణరెడ్డికి పట్టున్న ఆ ప్రాంతంలో వైసీపీ నేతల సమావేశాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. స్థానిక వైసీపీ నాయకుడు సంజీవరెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేయడంతో ఈ విషయం తెలుసుకున్న వైసీపీ ఎంపీ అవినాశ్‌ రెడ్డి పెద్దదండ్లూరుకి వెళ్తుండగా ఆ గ్రామ శివారులో పోలీసులు అడ్డుకున్నారు. ఆ గ్రామంలోకి ఆయన వెళితే ఉద్రిక్త పరిస్థితి మరింత చెలరేగే అవకాశం ఉంటుందని అన్నారు. అనంతరం అవినాశ్‌ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు ప్రొద్దుటూరుకు తరలించారు. పెద్దదండ్లూరులో పోలీసు బందోబస్తు పెంచారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments