తొలిప్రేమ సినిమాతో మంచి విజయం అందుకున్నారు మెగా హీరో వరుణ్ తేజ్ . ఇప్పుడు ఆయన తెలుగు చిత్ర పరిశ్రమ గర్వపడే ఘాజి చిత్రం రూపొందించిన సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా స్పేస్ థ్రిల్లర్ గా తెరకెక్కనుంది . ఇందులో వరుణ్ వ్యోమగామిగా కనిపించిననున్న విషయం తెలిసినదే . ఈ చిత్రం లో వరుణ్ కు జోడీగా లావణ్య త్రిపాఠి , అదితిరావు హైదరి నటిస్తున్నారు . అంతరిక్ష పరిశోధన నేపధ్యంలో కధ కావడంతో , భారీ బడ్జెట్ తో కూడిన సెట్ వేసి షూటింగ్ జరుపుతున్నారు . ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు . అందుతున్న సమాచారం ప్రకారం సహజత్వం కోసం వరుణ్ డూప్ లేకుండా తానే స్వయంగా రిస్కీ సీన్స్ చేస్తున్నారట . దాంతో చిత్రయూనిట్ మేగాహేరో విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటోందట . ప్రస్తుతం డూప్ లేకుండా చిత్రీకరిస్తున్న సన్నివేశాలు చిత్రానికి హైలైట్ గా నిలవనున్నాయట .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments