అర్జున్ రెడ్డి సినిమాతో బోలెడంత క్రేజ్ సంపాదించుకున్నారు హీరో విజయ్ దేవరకొండ .  దాని తరువాత  ఒక సినిమా విడుదలై పెద్ద విజయాన్ని అందుకోలేకపోయింది . తాజాగా ఆయన నటించిన చిత్రం టాక్షీ వాలా . ఒక ఆత్మకు టాక్సీవాలాకు మధ్య జరిగే ఆసక్తికర కధనంతో ఈ సినిమా ఉండబోతోంది . ఈ సినిమాను తొలుత మే 14 న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావించినా విడుదల అవ్వలేదు . తరువాత మళ్ళీ ఈ సినిమా జూన్ 14 న థియేటర్స్ కు వస్తున్నట్టు హీరో విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు.

అయితే ఇప్పుడు ఈ చిత్రం విడుదల మళ్ళీ వాయిదా పదే అవకాశం ఉందని ఫిలిం నగర్ వర్గాలలో టాక్ వినిపిస్తోంది . ఈ సినిమాలో కొన్ని సీన్స్ విజయ్ దేవరకొండ క్రేజ్ కు తగట్టుగా లేవని ,  ఆ సీన్స్ రీషూట్ చేస్తే బాగుంటుందని చిత్రబృందం భావించి ఆ పనిలో నిమగ్నమయ్యి ఉన్నారట . అందువల్ల ఈ సినిమాను జూలై లో విడుదల చేయాలని భావిస్తున్నారు . ఈ సినిమాలో ప్రియాంక జవాల్కర్ , మాళవిక నాయర్ హీరోయిన్లు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments