ఈ మధ్య తెలుగు రాష్ట్రాలలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి . అయితే తాజా ఇప్పుడు మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది . కోదాడ మండలం కొమరబండలో బైపాస్ వద్ద ఆగి వున్న లారీని కారువెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది.

హైదరాబాద్‌ నుంచి రావులపాలెం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన వారు సత్యనారాయణ(35), మైత్రి(21)గా గుర్తించారు. డ్రైవర్‌, మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి.  సత్యనారాయణ తల్లి చనిపోవడంతో సోంత ఊరికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని బాధితులు చెప్పారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments