రాజ్ తరుణ్ , కెరీర్ మొదటిలో మంచి విజయాలు అందుకున్నా తరువాత కొంచెం వెనక బడ్డారు . పోయిన శుక్రవారం విడుదలైన రాజుగాడు కూడా ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేకపోయింది . ఇక తన తదుపరి చిత్రాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు . అయితే కోలీవుడ్ లో ఘన విజయం సాధించిన సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు రాజ్ తరుణ్ . నయనతార , విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలలో తెరకెక్కిన నానుం రౌడీ దాన్ సినిమాను తెలుగులో రీమేక్ చేసే యోచనలో ఉన్నారు రాజ్ తరుణ్ . కానీ ఆ తమిళ్ సినిమా తెలుగులో నేను రౌడీనే అనే పేరుతో తెలుగులోనూ విడుదలయ్యింది . మరి ఆ సినిమాతో రాజ్ తరుణ్ ఆకట్టుకొని తిరిగి తన ఫాం లోకి రాగలరో , లేరో చూడాలి .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments