తన పోరాట యాత్రలో భాగంగా శ్రీకాకుళం , విజయనగరం జిల్లాల పర్యటన ముగించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శనివారం రాత్రి నుండి అరకులోని ఓ రిసార్టుకే పూర్తిగా పరిమితమయ్యారు. శనివారం సాయంత్రం పద్మాపురం గార్డెన్స్‌ దగ్గరున్న ఒక ప్రైవేటు రిసార్ట్ లో బసచేసిన, ఆదివారమంతా అక్కడే గడిపారు. కాసేపు రిసార్ట్ ఆవరణలోనే వాకింగ్ చేశారు. ఆపై తన గదిలోకి వెళ్లిపోయిన ఆయన ఇక బయటకు రాలేదని సమాచారం. పవన్‌ ను కలవడానికి పాడేరు ప్రాంతానికి చెందిన జనసేన కార్యకర్తలు, గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్యతో తదితరులు ప్రయత్నించినప్పటికీ, పవన్ అందుబాటులోకి రాలేదు. నేడు సీఎం చంద్రబాబునాయుడు విజయనగరం జిల్లా ఎస్‌ కోటలో పర్యటించనున్నందున, పవన్‌ కల్యాణ్ తన టూర్‌ షెడ్యూల్‌ ను కాస్తంత మార్చుకున్నారని సమాచారం.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments