కృష్ణా జిల్లా జగ్గయపేట మండలం బండి పాలెం లో ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రతిపక్షాలపై మండిపడ్డారు . ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని , ఇక ఆరోపణలను మాని సాక్ష్యాధారాలతో రావాలని అన్నారు . ప్రతిపక్షనేతలు పాదయాత్రలు , పోరాట యాత్రల పేరుతో చంద్రబాబును విమర్శించే కార్యక్రమం పెట్టుకున్నారని అన్నారు . నిరంతరం ఏపీ ప్రజల కోసం పనిచేస్తోన్న నాయకుడు చంద్రబాబు అని , అటువంటి నాయకుడిపై విమర్శలు చేస్తున్నారని అన్నారు .

ఇంకా మాట్లాడుతూ ఇన్ని రోజుల్లో ఒక్కరోజైనా ప్రధాని మోదీని వీళ్ళు విమర్శిస్తారా అని లోకేష్ ప్రశ్నించారు . ప్రత్యేక హోదాతో పాటు 18 అంశాలపై ఇచ్చిన హామీలను ఆయన గాలికి వదిలేశారని అన్నారు. చివరి బడ్జెట్‌లో కూడా ఏపీని కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని, ప్రతిపక్ష నాయకులకు ధైర్యం ఉంటే మోదీని నిలదీయాలని అన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments