గ్రామీణ నేపధ్యంలో “వెంకీ మామా” …

528

ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో మల్టీస్టారర్ అంటే గుర్తొచ్చే పేరు విక్టరీ వెంకటేష్ . ఆయన తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి బాబీ దర్సకత్వంలో సినిమా చేయబోతున్న విషయం తెలిసినదే .  ఈ సినిమాలో కూడా వీరిద్దరూ మేనమామ – మేనల్లుడే . అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబందించిన ఇంటరెస్టింగ్ విషయం ఒకటి తెలుస్తోంది . ఈ కధ అంతా గ్రామీణ నేపధ్యంలో రూపొందనుంది . చిత్రీకరణల ఎక్కువ భాగం తమిళనాడులోని కారైకూడి లో జరగనుంది . ఈ చిత్రానికి “వెంకీ మామా ” అనే పేరును దర్శక నిర్మాతలు పరిశీలిస్తున్నారు . ఈ చిత్రంలో వెంకటేష్ కు జోడీగా హ్యూమా ఖురేషి , నాగచైతన్య కు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటించనున్నారు . వచ్చే నెల నుండి ఈ చిత్రం చిత్రీకరణ ప్రారంభం అవుతుంది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here