ఆవారా, నా పేరు శివ, ఊపిరి సినిమాలతో టాలీవుడ్‌కు దగ్గరయ్యారు కార్తీ. గతేడాది ఖాకీ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం కార్తీ ‘చినబాబు’ సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నారు.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌తో ఈ సినిమా రైతు నేపథ్యంలో ఉండబోతోందని తెలుస్తోంది. తాజాగా విడుదలైన టీజర్‌లో రైతు గురించి చెప్పిన డైలాగ్‌లు బాగానే ఉన్నాయి. పుట్టించేవాడు దేవుడైతే.. పండించేవాడూ దేవుడే, నువు రైతువైతే కాలరేగురేసుకుని తిరుగంతే.. లాంటి డైలాగ్‌లతో టీజర్‌ ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ సినిమాలో కార్తీకి జోడిగా సాయేషా సైగల్‌ నటిస్తోంది. ఈ చిత్రం పాండిరాజ్‌ దర్శకత్వంలో రూపొందగా,  2డీ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై కార్తీ అన్నయ్య, హీరో సూర్య నిర్మించారు.

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments