ఆయనను భరించే శక్తీ ఏపీకి లేదు …

0
198

వైఎస్ఆర్సీపీ అధినేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజికవర్గంలో పర్యటించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఆన్ని రంగాలలో అవినీతి నెంబర్ 1 చేశారని ఎగ్దేవా చేశారు . ఆయన పాలన అంతా ప్రజలను మోసం చేయడం , మభ్యపెట్టడంతోనే ఉందని అన్నారు . బాబు 2050 కు ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతామని అంటున్నారని అన్నారు .

జగన్ మాట్లాడుతూ “చంద్రబాబు నాయుడి వయసు ఎంతో తెలుసా? దాదాపు 70 సంవత్సరాలు.. ఈ మనిషి 2050 గురించి మాట్లాడుతున్నారు. అంటే దాని అర్థం ఏమిటి? అప్పటికి ఆ మనిషికి 102 ఏళ్లు వస్తాయి. అంటే అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌ని దోచుకుంటూనే ఉందామని చంద్రబాబు అనుకుంటున్నారు. అన్ని ఏళ్లు బతికే శక్తి ఆయనకు ఉండొచ్చేమోగానీ, ఆయనను భరించే శక్తి ఏపీ ప్రజలకు లేదు” అని అన్నారు .

ఇంకా మాట్లాడుతూ ఆనాడు ప్రత్యేకహోదాను చంద్రబాబు అమ్ముకోకపోతే మనం నిజంగానే నెంబర్ 1 అయ్యేవాళ్ళమని అన్నారు . కానీ బాబు పాలనలో ఏపీ అత్యాచారాలలో , అవినీతిలో , పెట్రోల్ , డీజిల్ ధరలను పెంచడంలో నెంబర్ 1 గా ఉందని అన్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here