బిగ్ బాస్ 2 తెలుగు కార్యక్రమానికి హోస్ట్ గా హీరో నాని వ్యవహరించనున్న విషయం తెలిసినదే . జూన్ 10 నుండి 100 రోజుల పాటు ఈ కార్యక్రమం సాగనుంది . అయితే దీనికి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమంలో నాని మాట్లాడుతూ వచ్చే మూడున్నెర నెలల కాలం పాటు తాను తెలుగువారి ఇళ్ళల్లో తెలుగు ప్రేక్షకులతో కలిసి ఉంటానని వ్యాఖానించారు . బిగ్ బాస్ 2 రియాల్టీ షో హోస్ట్ గా తాను ప్రక్షకుల ఇంట్లో కుటుంబ సభ్యుడిగా ఉండునున్నానని , యాంకర్ గా తన తొలి ప్రయత్నాన్ని ఆశీర్వదించాలని కోరారు . ఎన్నో సినిమాలు చేసినా తనకు చాలడం లేదని , తన దాహాన్ని బిగ్ బాస్ తీరుస్తుందనే నమ్ముకంతో ఉన్నానని అన్నారు . సినిమా షూటింగ్ కన్నా , బిగ్ బాస్ నిర్వాహకులు మరింత ఆర్గనైజ్ద్ద్ గా ఉన్నారని నాని తెలిపారు . ఈ కార్యక్రమాన్ని తాను వ్యాఖ్యాతగా విజయవంతం చేయగలనని తనను బిగ్ బాస్ నిర్వాహకులు నమ్మించారని , ఆ నమ్మకంతోనే ఒప్పుకున్నానని అన్నారు . మొత్తం 16 మంది ఇంటి సభ్యులతో స్టార్ మా లో బిగ్ బాస్ ప్రసారం కానున్న విషయం తెలిసినదే .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments