నేడు విజయనగరం జిల్లాలో చంద్రబాబు పర్యటన …

0
204

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. జమ్ముదేవి పేటలో ఉదయం గ్రామస్తులతో కలిసి రచ్చబండలో సీఎం పాల్గొననున్నారు. అనంతరం ఏస్‌కోటలో జరిగే నవనిర్మాణ దీక్ష బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగిస్తారు. అక్కడి నుంచి జిల్లాలోని ఎల్‌కోట మండలం జమ్మదేవిపేట గ్రామంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. కాగా రచ్చబండ కార్యక్రమంలో మీడియాను అనుమతించేందుకు డీపీఆర్‌వో నిరాకరించారు. దీంతో మీడియాను పరిసరప్రాంతాల్లోకి రానీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here