పెరిగిన చంద్రబాబు ఫాలోయింగ్ …

0
209

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ట్విట్టర్‌ ఖాతా ఫాలోవర్ల సంఖ్య నాలుగు మిలియన్లకు చేరింది. దక్షిణాదిలో ఏ నేతకూ లేనంతగా ఆయన ఫాలోవర్లను సంపాదించుకున్నారు. టెక్నాలజీని బాగా ఉపయోగించుకుంటారన్న పేరు తెచ్చుకున్న చంద్రబాబు 2009 అక్టోబర్‌లో ట్విట్టర్‌ ఖాతా తెరిచారు. తన పర్యటన వివరాలు, వీడియోలు, తమ ప్రభుత్వం చేపడుతోన్న కార్యక్రమాలను ఆయన అధికంగా పోస్ట్ చేస్తారు.

తన ట్విట్టర్‌ ఖాతాను నాలుగు మిలియన్ల మంది అనుసరిస్తున్నందుకు ఆనందంగా ఉందని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. ట్విట్టర్‌ ద్వారా సలహాలు, సూచనలు ఇస్తూ స్పందించిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here