అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లా జమ్మాదేవిపేటలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు . ఈ సందర్భంగా ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు . ఆయన మాట్లాడుతూ మొన్నటిదాకా టీడీపీ తో కలిసి ఉన్న పవన్ కళ్యాణ్ సడన్ గా యూటర్న్ తీసుకున్నారని అన్నారు . తనను తిట్టడమే పనిగా పవన్ పెట్టుకున్నారని అన్నారు . పవన్ కళ్యాణ్ వాస్తవాలను తెలుసుకొని మాట్లాడడం లేదని విమర్శించారు .  ఇంకా మాట్లాడుతూ ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను నమ్మించి మోసం చేశారని , బీజేపీ ని ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు . ప్రతిపక్ష వైసీపీ బీజేపీ తో చేతులు కలిపి ఏపీకి ద్రోహం చేస్తోందన్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments