టాలీవుడ్ హీరోలు vs తెలంగాణ పోలీసులు

844

తెలంగాణ అవతరణ దినోత్సవాల్లో భాగంగా జరిగిన హైదరాబాద్ పోలీసు క్రికెట్ లీగ్ లో గెలిచిన జట్టు, నేడు టాలీవుడ్ నటులతో కూడిన జట్టుతో క్రికెట్ మ్యాచ్ ఆడనుంది. కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ఈ పోటీ జరుగుతుందని, నేటి సాయంత్రం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో 5.30 గంటల నుంచి జరిగే మ్యాచ్ ని చూసేందుకు ప్రవేశం ఉచితమని, క్రీడాభిమానులు తరలి రావాలని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ వెల్లడించారు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ జట్టులో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, అఖిల్, శ్రీకాంత్, విజయ్ దేవరకొండ, నితిన్, నాని తదితరులు ఆడతారని చెప్పారు.  ఈ మ్యాచ్ చూసేందుకు పెద్దఎత్తున నగరవాసులు రావాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here