ఈ రోజులలో ప్రతీ మనిషీ స్మార్ట్ ఫోన్ కు అడిక్ట్ అయిపోయారు . ఉదయం లేచింది మొదలు వాట్స్అప్ లో మెసేజస్ చూసుకోవడంతో మొదలు రాత్రి నిద్రపోయేవరకు ప్రతీ క్షణం ఫోన్ తోనే గడుపుతున్నాం . చివరకు రోడ్ మీద నడుస్తునప్పుడు . డ్రైవింగ్ చేస్తున్నప్పుకుడా ఫోన్ వాడే వాళ్ళ సంఖ్య ఎక్కువే . దీని వాళ్ళ చాలా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి . అయితే ఇప్పుడు ఇంటర్నెట్ లో ఒక వీడియో ట్రెండ్ అవుతోంది . ఈ వీడియో వినోదం కోసం చేసినదే అయినా మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బాగా చూపించారు .

ఈ వీడియో లో విషయం ఏమిటంటే గైడింగ్ హాండ్స్ అనే సంస్థ ప్రతినిధులు స్మార్ట్ ఫోన్ అడిక్ట్ అయిన వారికి రోడ్డు దాటించడంలో , డ్రైవింగ్ లో కార్ స్టీరింగ్ ను కంట్రోల్ చేస్తూ , తల్లితండ్రుల ఫోన్ చాటింగ్ కు ఇబ్బంది లేకుండా వారి పిల్లలను ఆడిస్తూ , ఐస్ క్రీం తినిపిస్తూ కనిపిస్తారు . అయితే ఇది వినోదం కోసం రూపొందించిన విషయం అయినా మనం స్మార్ట్ ఫోన్ కు బానిసలై లోకం పట్టకుండా ఎలా జీవిస్తున్నామో అర్ధంచేసుకోవచ్చు .

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments