జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పోరాతయత్ర లో భాగంగా విజయనగరం జిల్లా కోట జంక్షన్ వద్ద జరిగిన బహిరంగసభలో పాల్గన్నారు . ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ఏపీ మంత్రి నారా లోకేష్ కు తానంటే చాలా కోపమని అన్నారు . లోకేష్ గారూ , టీడీపీ ప్రభుత్వం నిలబడడానికి తానే కారణమే విషయం గుర్తుంచుకోండి అని లోకేష్ ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు . తెలుగుదేశం పాలనో అవినీతి విపరీతంగా పెరిగిపొయిందని ఆరోపించారు . టీడీపీ , వైసీపీ నేతలు భయపెట్టినంతమాత్రాన తాము చేతులు కట్టుకొని కూర్చోమని పవన్ అన్నారు .

ఇంకా మాట్లాడుతూ తానెవరో తెలియదంటూ ఎంపీ అశోక్ గజపతి రాజు వ్యాఖ్యానించారని మండిపడ్డారు . ఇప్పుడు మీ కోట వద్దకు వచ్చి మాట్లాడుతున్నానని తానే పవన్ కళ్యాణ్ అని వ్యంగ్యాస్త్రాన్ని విసిరారు . 2014లో నేను వచ్చి ప్రచారం చేస్తేనే ఇప్పుడు మీరు పదవిని అనుభవిస్తున్నారని  పవన్ ఎగ్దేవా చేశారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments