జగన్ ఉండాల్సింది పిచ్చాసుపత్రిలో ..

1028

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైసీపీ అధినేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు . ఆయన మాట్లాడుతూ తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని రాష్ట్రాన్ని దోచేసిన ఘనత జగన్ దని అన్నారు . ముఖ్యమంత్రి చంద్రబాబును కానీ , తనను కానీ విమర్శించే అర్హత జగన్ కు లేదని అన్నారు . జగన్ ఉండాల్సింది జనాల మధ్య కాదని , మెంటల్ హాస్పిటల్ లో అని అన్నారు . రాత్రిప్రగలు రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నారని , లోటు బడ్జెట్ లో సైతం అభివ్రుద్ధిపధంలోకి తీసుకెళుతున్నామని చెప్పారు . జగన్ రాష్ట్రాన్ని దోచేస్తే , ఆయన అనుచరులు గుళ్ళను , గోపురాలను దోచేశాడని విమర్శించారు . పాలకొల్లులో జగన్ పోటీ చేస్తే ఆయన డిపాజిట్ కూడా దక్కదని , ఒకవేళ డిపాజిట్ దక్కితే తాను రాజకీయ సన్యాసం చేస్తానని నిమ్మల రామానాయుడు సవాలు చేశారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here