అంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ శాఖ మంత్రి ఈరోజు మీడియాతో మాట్లాడారు . ఆయన మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ , జనసేన అధినేత పవన్ ఒకరినొకరు విమర్శించుకోవటంలేదని , ప్రజలు వారిద్దరి తీరును గమనిస్తున్నారని అన్నారు . ఇంకా మాట్లాడుతూ ధర్మ పోరాట దీక్షను కొందరు తమ వ్యాఖ్యల ద్వారా పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారని అన్నారు . జగన్ నయవంచన దీక్ష పేరుతో ప్రజలను మోసం చేస్తూ రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు . సీఎం చంద్రబాబు పై బీజేపీ నేతలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని , వైసీపీ ఎంపీల రాజీనామాలను ఉద్దేశపూర్వకంగానే ఆమోదించటంలేదని అన్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments