ఇటీవల ‘భరత్ అనే నేను’ చిత్రాన్ని చూసిన తరువాత చిత్ర టీమ్ ను ముఖ్యమంగా మహేష్ బాబు, కొరటాల శివను పొగడ్తలతో ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఆపై ఈ చిత్రం తన జీవితానికి దగ్గరగా ఉందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అదే సమయంలో కేటీఆర్ “మహేష్‌ కేవలం అమ్మాయిలకు మాత్రమే సెల్ఫీలు ఇస్తారు. నేను మాత్రం అబ్బాయిలకు కూడా సెల్ఫీలు ఇస్తాను” అని సరదాగా చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇక తాజాగా ఓ నెటిజన్, తాను కేటీఆర్ తో దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ,  “నిజ‌మే… కేటీఆర్ గారు అబ్బాయిల‌కి కూడా సెల్ఫీలు ఇస్తారు” అనే కామెంట్ తో దాన్ని కేటీఆర్ కు ట్యాగ్ చేయగా, ఆయన స్పందించారు. దానిపై రీ ట్వీట్ చేస్తూ, మహేష్ బాబును ట్యాగ్ చేసి, “మహేష్… ఇది నీ కోసమే” అన్న కామెంట్ ను ఉంచారు.

 

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments