టీఆర్ఎస్ పార్టీలో చేరితే మంత్రి పదవిని ఇస్తానంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు ఆఫర్ చేశారని మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంత్రి పదవి కావాలా లేక మరేదైనా కావాలా అని అడిగారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలోనే పుట్టి, పెరిగిన తనకు సొంత పార్టీని వీడటం ఇష్టం లేదని… అందుకే, కేసీఆర్ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించానని తెలిపారు. అప్పట్నుంచి తనపై కేసీఆర్ కక్షసాధింపు చర్యలకు దిగారని మండిపడ్డారు. శాసనసభలో కేసీఆర్ ను తాను దగ్గరగా చూశానని… ఆయన కంటే పెద్ద మోసగాడిని తాను ఇంత వరకు చూడలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు పతనం తప్పదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments