టీడీపీ పై విమర్శలు తప్ప పర్యటనలో ఏమి లేవు …

577

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పోరాట యాత్రలో భాగంగా అడుగడుగునా తెలుగుదేశం ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసినదే . అయితే ఇప్పుడు  ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి , తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకటరావు ఈ విషయం పై స్పందించారు . ఆయన మాట్లాడుతూ పోరాట యాత్ర పేరుతో పవన్ చేస్తున్న పర్యటన అంతా టీడీపీ పై విమర్శలు చేయడానికే అన్నట్టుందని , ఆయన పర్యటనలో వేరే అంశాలు ఏమి లేవని  అన్నారు .

పవన్ ఉద్దానం సమస్యపై జనసేననే వెలుగులోకి తెచ్చిందని ప్రతీ సభలో చెప్తున్న విషయం తెలిసినదే . ఈ విషయం పై స్పందిస్తూ ఉద్దానం , శ్రీకాకుళం లో ఎన్ని డయాలసిస్ కేంద్రాలు ఉన్నాయన్న విషయం పై ఆయనకు కనీస అవగాహన ఉందా ? అని కళా వెంకటరావు ప్రశ్నించారు . ఈ పర్యటనలో వైసీపీ , బీజేపీ లను పవన్ పల్లెత్తు మాట కూడా అనడం లేదని ఇది కచ్చితంగా బీజేపీ వెనక ఉంది నడిపిస్తున్న డ్రామా అని అన్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here