చెడు వ్యసనాల వల్ల ఎన్నో కుటుంబాలలో కలహాలు చెలరేగుతున్నాయి . వాటిని దూరం చేసుకోగలిగితే జీవితమంతా ఆనందభరితంగా ఉంటుంది . ఈ నేపధ్యంలో విడుదలైన లఘు చిత్రం “ఫికర్” . ఈ షార్ట్ ఫిలిం మొత్తం తెలంగాణ మాండలికం లో ఉండడం విశేషం . ఈ షార్ట్ ఫిలిం లో ఇద్దరు అనూన్య దంపతుల మధ్య తాగుడు అనే వ్యసనం వల్ల కలిగే మనస్పర్ధలు ఎలా ఉంటాయో చాలా బాగా చూపించారు . పల్లెటూరి వాతావరణంలో  తాటి చెట్ల వద్ద కల్లు తాగుతూ స్నేహితులు మాట్లాడుకోవడం అనే అంశం నేటివిటీ కి చాలా దగ్గరగా ఉంది . షార్ట్ ఫిలిం చివరికి వచ్చేసరికి ఒక వ్యక్తి తన తప్పు తెలుసుకొని తన చెడు వ్యసనాలను దూరం చేసుకోగలిగితే జీవితం ఎంత ఆనందంగా ఉంటుందనేది బాగా అర్ధమయ్యేలా చెప్పారు .

దర్శకత్వం :  అంజిబాబు .

రచన – నిర్మాత :  శ్రీరంగం నల్లాన్ చక్రవర్తుల మురళీకృష్ణ .

కెమెరా :  నరహరి .

ఎడిటింగ్ :  గట్టు రవి .

సంగీతం :  రోహిత్ జిల్ల .

 

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments