రాజమహేంద్రవరం లో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు మాట్లాడారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల తరువాత ఎవరు ఎవరితో ఉంటారో కాలమే నిర్ణయిస్తుందని అన్నారు . టీడీపీ అధినేత , ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్ళీ గెలిచి అధికారంలోకి వస్తారో లేదో కూడా ఇప్పుడే చెప్పలేమన్నారు . రాష్ట్రంలోని 175 స్థానాలలో బీజేపీ ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తుందన్నారు .

ఇంకా మాట్లాడుతూ “చంద్రబాబు తో పొత్తు వద్దు  , మనం కలిసి పోటీ చేద్దామని గత ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ తో చెప్పాను కానీ ఆయన వినలేదు . చంద్రబాబు అంటే ఆయనకు అభిమానం  . ఆయన అనుభవజ్ఞుడని, ఆయనే ఉండాలని అన్నాడు. కానీ ఇప్పుడు టీడీపీ నాయకులు పవన్‌పై విమర్శలు చేయడం బాధాకరం’ అని అన్నారు. చంద్రబాబుకు నాడూ, నేడూ దూరంగానే ఉన్నానని తెలిపారు. అయితే పార్టీ నిర్ణయాల మేరకు తెలుగుదేశంతో కలిసి పోటీ చేద్దామని చెప్పానన్నారు. కన్నా లక్ష్మీనారాయణ వంటి వారు బీజేపీలోకి వచ్చారని, గాలి జనార్దనరెడ్డి వంటివారు పార్టీలో ఉన్నారని ప్రస్తావించగా.. కొంత మార్పు కోసమే ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నామన్నారు. వాళ్లను మార్చడం కోసమే చేర్చుకున్నామని వ్యాఖ్యానించారు. తిరుమలలో రాజకీయాలకు అతీతంగా ధర్మ వ్యవస్థ నడవాలని, అధికారంలోకి వస్తే చాగంటి కోటేశ్వరరావు, చినజీయర్‌ స్వామి వంటి ప్రముఖులకు టీటీడీ బాధ్యతలు అప్పగించే ఆలోచన చేస్తామన్నారు.

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments