సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ కు తన ముగ్గురు మావయ్యలు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు . ఈ విషయాన్ని మరొకసారి నిరూపించుకున్నారు తేజ్ . రాజమహేంద్రవరం లో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన వెళ్ళారు . ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ చెబితే జనసేన తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సిద్ధమేనని , కల్యాణ్ ఎం చెబితే తానది చేస్తానని స్పష్టం చేశారు . ఇంకా మాట్లాడుతూ తాను నటించిన తేజ్ ఐ లవ్ యు సినిమా ఈ నెల 29 న విడుదలకానుందని , మరో సినిమా షూటింగ్ దశలో ఉందని అన్నారు . ఇప్పటికే రామచరణ్ జనసేన ప్రచారం విషయంలో స్పందించగా దానికి ప్రతిస్పందిస్తూ ఆయన తన కుటుంబ సభ్యులను పిలవనని అన్నారు . మరి చూడాలి తేజ్ కోరిక నెరవేరుతుందో లేదో .

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments