ప్రధాని మోదీ పూర్తిగా విఫలమయ్యారు …

516

కర్నాటకలోని ఉడిపి పెజాహర పీఠాదిపతి విశ్వేశ్వతీర్ధ స్వామి ప్రధాని మోదీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు . దేశప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రధానిగా మోదీ పూర్తిగా  విఫలమయ్యారని అన్నారు . అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళు అయినా ఇచ్చిన హామీ ప్రకారం నల్ల ధనాన్ని వెనక్కి తీసుకురాలేకపోయారని అసంతృప్తి వ్యక్తం చేశారు . ఆయన మాటలపై ప్రజలకు విశ్వాసం ఉండేదని , కానీ దానిని ఆయన పోగొట్టుకున్నారని స్వామీజీ అన్నారు .

స్వామీజీ ఇంకా మాట్లాడుతూ తనకు ఏ పార్టీ పైనా సదభిప్రాయం లేదని , వచ్చే ఎన్నికలలో మాత్రం నల్లధన ప్రభావం కచ్చితంగా ఉంటుందన్నారు . ఎన్నికల్లోగా నల్లధనాన్ని దేశానికి రప్పిస్తే బాగుంటుందని అన్నారు . ఈ సందర్భంగా కర్నాట ముఖ్యమంత్రి కుమారస్వామి గురుంచి మాట్లాడుతూ కుమారస్వామి అనుభవం ఉన్న నేతని , రాష్ట్రాన్ని చక్కగా పాలించగలడని అభిప్రాయపడ్డారు .

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here