జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పోరాట యాత్ర లో భాగంగా ఈరోజు విజయనగరం జిల్లా భోగాపురంలో పర్యటించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ప్రజలను రెచ్చగొడుతున్నానని  , బీజేపీ రాసిచ్చిన స్క్రిప్టు చదువుతున్నానని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని , తాను రెచ్చగోట్టేవాడిని కాదని , నిజాలు చెప్పేవాడినని పవన్ అన్నారు . ఈవిధంగా ప్రజలను దోపిడీ చేస్తూ వంచిస్తే తాను చేతులు కట్టుకొని కూర్చునేవాడినని కాదని అన్నారు .

ఇంకా మాట్లాడుతూ ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు చదవానికి తాను వ్యక్తిత్వం లేని వాడిని కాదని పవన్ అన్నారు  అలాగే తాను మాటలు మార్చే వాడిని కానని , ఎప్పుడూ ఒకే మాటపై ఉంటానని , తనకు బీజేపీ కి ఎటువంటి సంబంధం లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు . టీడీపీ ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించలేకపోతోందని ,మరోవైపు సింగపూర్ తరహా అభివృద్ధి అని అంటోందని అన్నారు . సింగపూర్ లో కుల , మత , ప్రాంతాలకి ప్రాధాన్యత ఇవ్వరని , అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తారని తెలిపారు .

ఇంకా మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం కనీసం ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించలేకపోతున్నారని , తుపాన్ల వంటి ప్రకృతి విపత్తుల నుండి ప్రజలకు రక్షణ కల్పించలేకపోతున్నారని పవన్ విమర్శించారు . భోగాపురం లో అభివృద్ధి పేరుతో భూములు తీసుకున్నారు కానీ అభివృద్ధి మాత్రం చేయలేదని అన్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments