సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ కధానాయకుడిగా విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమా కాలా . ఈ చిత్రంపై ప్రేక్షకులు చాలా అంచనాలు పెట్టుకున్నారు . అయితే ఇప్పుడు ఈ చిత్రానికి ఇబ్బందులు కలుగుతున్నాయి . అసలు విషయానికి వస్తే ఇటీవల కావేరి జలాల విషయంలో తమిళనాడుకు మద్దతుగా రజనీ మాట్లాడిన విషయం తెలిసినదే . అయితే ఈ విషయం పై కన్నడ రక్షణ వేదిక అధ్యక్షుడు ప్రవీణ్ శెట్టి మాట్లాడుతూ ఒకవేళ కర్ణాటకకు రజనీకాంత్ బహిరంగ క్షమాపణ చెప్పినా తాము కాలా విడుదలకు ఒప్పుకునే సమస్యే లేదని అన్నారు . కావేరి జలాలపై తమిళనాడుకు అనుకూలంగా మాట్లాడుతున్న రజనీ , కమల్ కు సంబంధించిన ఏ సినిమా కూడా తమ రాష్ట్రంలో విడుదల కావడానికి వీల్లేదని తేల్చి చెప్పారు . అయితే ఈ విషయం పై స్పందించిన కర్ణాటక సీఎం కుమారస్వామి తాము మరోసారి కన్నడ రక్షణ వేదిక వారితో చర్చలు జరిపి o నిర్ణయం తీసుకుంటామని తెలిపారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments