తెలుగు బుల్లితెరపై మొట్టమొదటి రియాలిటీ షో బిగ్ బాస్ . ఈ షో మొదటగా ఉత్తరాదిన విజయం సాధించింది దాదాపు 11 సీజన్లుగా జరుగుతోంది . ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా జరిగిన బిగ్ బాస్ మొదటి సీజన్ విజయవంతమై ఇప్పుడు రెండవ సిజన్ కు రెడీ అయ్యింది . అయితే ఇప్పటికే ఈ షో హోస్ట్ గా నాచురల్ స్టార్ నాని చేయబోతున్నారని దానికి సంబంధించిన టీజర్ ను కూడా విడుదల చేశారు . ఈ రెండోవ సీజన్ మొత్తం 100 రోజులపాటు సాగనుంది . టీజర్ లో ఇంకొంచెం మసాలా అని నాని చేత చెప్పించడం ద్వారా ఈ షో లో ఇంకొన్ని కొత్త అంశాలు జోడించబోతున్నామని ప్రోగ్రాం నిర్వాహకులు హింట్ ఇచ్చినట్టుగా భావించవచ్చు .

అయితే ఇప్పుడు షో కాన్సెప్ట్ ను వివరిస్తూ ఓ ఆసక్తికరమైన వీడియోను నిర్వాహకులు విడుదల చేశారు . ఈ వీడియోలో అక్వేరియం లో వివిధ రకాల చేపలను చూపిస్తూ దానికి నాని వాయిస్ ను జోడించారు . ఈ ప్రోగ్రామ్ జూన్ 10 ను ప్రారంభం కానున్న విషయం తెలిసినదే .

 

https://youtu.be/jiilCUVTxW8

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments