రీల్ హీరోనే కాదు … రియల్ హీరో కూడా …

606

తాను రీల్ హీరోనే కాదు , రియల్ హీరోను కూడా అని నిరూపించుకున్నాడు ఓ హాలీవుడ్ నటుడు . అవెంజర్స్ , ఇన్ఫినిటీ వార్ వంటి సినిమాలలో నటించిన బెనెడిక్ట్ కంబర్బ్యాచ్ సినిమాలలో రిస్కీ ఫీట్లకు పెట్టింది పేరు . కాని తాను నిజజీవితంలోనూ రిస్కీ ఫీట్స్ చేయగలనని నిరూపించాడు . తాజాగా లండన్‌లోని బేకర్ స్ట్రీట్ గుండా ఉబెర్ క్యాబ్‌లో బెనెడిక్ట్ ప్రయాణిస్తున్నాడు. ఆ సమయంలో ఓ సైకిలిస్ట్‌పై కొందరు దొంగలు దాడి చేయడాన్ని గమనించాడు. వెంటనే నడుస్తున్న కారులోంచి దూకి.. దుండగులపై పడ్డారు. వారిని చితకబాతి సైకిలిస్ట్‌ను కాపాడారు. కాగా, దుండగులు బెనడిక్ట్‌ను గుర్తుపట్టి అక్కడి నుంచి పారిపోయారు. అలా పారిపోతూ ఓ దొంగ.. సైకిలిస్ట్ సైకిల్‌ను దొంగిలించేందుకు ప్రయత్నించగా.. దానిని సైతం బెనడిక్ట్ అడ్డుకుని సూపర్ హీరో అనిపించుకున్నాడు. కాగా, దుండగులు బెనడిక్ట్‌పైనా దాడికి యత్నించగా.. వారిపై ఎదురుదాడి చేసి తరిమారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here