ఆటగదరా శివ అంటూ అనే మాట వినగానే ప్రముఖ విలక్షణ నటుడు , రచయత తనికెళ్ళ భరణి రచించిన శతకం గుర్తుకు వస్తుంది . ఈ శతకం ద్వారా జీవితంలో ఆ పరమాత్ముడు ఆడించే ఆటలు గురుంచి బాగా వర్ణించారు . తనికెళ్ళ భరణి దర్శకత్వం వహించిన మిధునం సినిమాలో కూడా ఒక పాట ఈ పదం తోనే మొదలవుతుంది .

అయితే ఇప్పుడు ఈ టైటిల్ తో ఒక సినిమా రూపొందింది . ఆ నలుగురు , మధుమాసం , అందరి బంధువయా లాంటి క్లాస్ సినిమాలు రూపొందించిన దర్శకుడు చంద్రసిద్ధార్థ చాలా గ్యాప్ తరువాత మరో డిఫరెంట్ మూవీ తో మన ముందుకు వస్తున్నారు . తన మార్క్ కనిపించేలా తెరకెక్కిన ఈ సినిమాకు ఆటగదరా శివ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు .

ఈ సినిమాలో హైపర్ ఆది కీలక పాత్రలో నటించారు . ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది . ఈ సినిమాను కన్నడ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నారు . ఈ సినిమాను జూన్ నెలాఖరున విడుదల చేయనున్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments