శ్రీకాంత్ కన్యాదానం సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది . ఈ చిత్రంలో స్వయంగా భర్తే భార్యకు , ఆమె ప్రియుడికి పెళ్లి చేస్తాడు . అచ్చం అటువంటి సంఘాతే కాన్పూర్ లో చోటుచేసుకుంది . సనిగ్వాన్ గ్రామానికి చెందినా సుజిత్ కు శాంతి అనే అమ్మాయితో పెళ్లైంది . పెళ్లి అయ్యి కనీసం రెండు వారాలు కూడా గడవకముందే శాంతి పుట్టింటికి వెళ్ళిపోయింది . ఎంత కాలం వేచి చూసినా తిరిగి రాకపోవడంతో శాంతి ఇంటికి వెళ్లి కారణమేంటని సుజిత్ ఆరా తీశాడు . దానితో తాను రవి అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నానని , పెద్దలు బలవంతంగా పెళ్లి జరిపించారని చెప్పి బోరున విలపించింది శాంతి . అది విని మొదట షాక్ కు గురైన సుజిత్ , శాంతిని రవికిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చాడు . తరువాత రవి ఉద్దేశం కనుక్కొని , తన కుటుంబసభ్యులను , శాంతి కుటుంబసభ్యులను ఒపోపించి అనంతరం పోలీసుల సహకారంతో ప్రేమికులిద్దరినీ ఒకటి చేశాడు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments