పోలీసు ఉద్యోగమే తమ ధ్యేయంగా ప్రయత్నిస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం తీపి వార్త తెలిపింది . 18,428 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది . ఇందులో 1503 ఎస్సై , 16,925 కానిస్టేబుల్ ఉద్యోగాలకు ధరఖాస్తులు చేసుకోవచ్చు . ఎస్సై ఉద్యోగాలకు విద్యార్హత డిగ్రీ అని ప్రకటించింది. కానిస్టేబుల్ ఉద్యోగానికి ఇంటర్మీడియట్‌ అర్హతగా పేర్కొని, వచ్చేనెల 9 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. హోంగార్డులుగా ఏడాదిపాటు పనిచేసిన వారికి వయోపరిమితి సడలింపు ఇవ్వనుంది. పోలీసు ఉద్యోగాల నియామక ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేయనున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments