ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజ కంపెనీ శాంసంగ్ మరో కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది . గెలాక్సీ జె సిరీస్ లో శుక్రవారం సరికొత్త డివైస్ తీసుకొచ్చింది . ఈ ఫోన్ రెండు వెర్షన్ లలో లభించనుంది . 2 జీబీ / 16 జీబీ స్టోరేజ్ ధరను 9,990 రూపాయలుగా , 3 జీబీ / 32 జీబీ స్టోరెజి ధరను రూ . 11,990 రూపాయలుగా శాంసంగ్ నిర్ణయించింది .
ఈ ఫోన్లు నీలం, నలుపు, బంగారు రంగుల్లో అందుబాటులో ఉంటుందని శాంసంగ్ వెల్లడించింది. “మేక్ ఫర్ ఇండియా” లో భాగంగా తీసుకొచ్చిన ఈ ఫోన్లో అధునాతన మెమరీ మేనేజ్మెంట్ ఫీచర్‌ను జోడించినట్టు చెప్పారు. సోషల్ మీడియా అప్లికేషన్ల నుంచి వచ్చే డూప్లికేట్ ఫోటోలు, వీడియో కంటెంట్‌ను ఆటోమేటిక్‌గా డిలీట్ చేస్తుందని తెలిపారు. తద్వారా మొమరీ స్పేస్ బాగా ఆదా అవుతుందని పేర్కొన్నారు.
గెలాక్సీజె 4 ఫీచర్లు
5.5 అంగుళాల హెచ్డీ సూపర్ అమోలెడ్ డిస్ప్లే
ఆండ్రాయిడ్ ఓరెయో 8.0
13ఎంపీ రియర్ కెమెరావిత్ ఎల్ఈడీ ఫ్లాష్
5ఎంపీ సెల్ఫీ కెమెరా
2జీబీ/16జీబీ స్టోరేజ్ , 3జీబీ/32 జీబీ స్టోరేజ్
256 దాకా విస్తరించుకునే అవకాశం
3,000 ఎంఏహెచ్ బ్యాటరీ