అందరూ కలిసి తెలంగాణను సుస్సంపన్నం చేసుకోవాలి…

0
215

కొన్ని దశాబ్దాల ఉద్యమం ఫలించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకొని రేపటికి నాలుగేళ్ళు . ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజలందరికీ తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు . “ఆరున్నర దశాబ్దాల పోరాటంతో సిద్ధించిన ఈ రాష్ట్రం సుసంపన్నం కావాలంటే అందరూ కలసికట్టుగా పని చేయాలి. వందలమంది పోరాటయోధులు తమ ప్రాణాల్ని తృణప్రాయంగా త్యాగం చేసి తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోశారు.

ఆ వీరుల త్యాగాలను ఎల్లవేళలా గుర్తుచేసుకొంటూ… వారి కలలని సాకారం చేయాల్సిన బాధ్యత పాలకులపై ఉంది. తెలంగాణ రాష్ట్రం పాడిపంటల్లో.. పరిశ్రమల్లో… ఉపాధి ఉద్యోగ కల్పనలో అభివృద్ధి చెందుతూ ముందుకు వెళుతూ, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రెస్‌నోట్‌ విడుదల చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here