జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోరాట యాత్ర 10 వ రోజులో భాగంగా ఆయన సాలూరు నియోజికవర్గంలో పర్యటించారు . పవన్ సాలూరు బహిరంగ సభలో మాట్లాడుతూ అవినీతిని చంద్రబాబు నిరూపించాలని అంటున్నారు  , లంచాలు తీసుకుంటే ఎవరైనా రసీదులు ఇస్తారా అని ప్రశ్నించారు . విజయనగరం జిల్లాలో అక్రమంగా కొండలను తవ్వేస్తున్నారు , ఇది అవినీతి కాదా అని టీడీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు . అంగన్వాడీ ఉద్యోగాలకు కూడా టీడీపీ నేతలు లక్షలు వసూలు చేస్తున్నారని  , సాలూరులో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తామన్న హామీ ఏమైందని నిలదీశారు . జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని పవన్ డిమాండ్ చేశారు .

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments