జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోరాట యాత్రలో భాగంగా విజయనగరం జిల్లా పార్వతీపురం లో నిరసన కవాతు నిర్వహించిన తరువాత అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడారు . ఈ సందర్భంగా తెలుగుదేశం ప్రభుత్వం పై డైరెక్ట్ ఎటాక్ చేశారు , స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ చంద్రబాబు పై దుమ్మెత్తి పోశారు . ముఖ్యంగా అక్కడ ఉన్న నీటి సమస్యపై స్పందిస్తూ , నీళ్ళ బాటిల్ ను చూపిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఈ నీళ్ళు తాగాలని ప్రజలు చెప్పాలని సూచించారు , అప్పుడు కానీ ఇక్కడి ప్రజల బాధలు ఆయనకు తెలియవన్నారు . పూర్తిగా కలుషితమైన ఈ నీటిని తాగితే కలరా , అంటువ్యాధులు రాకుండా ఉంటాయా ? అని ప్రశ్నించారు . పార్వతీపురం ఎవరొచ్చినా ఈ నీళ్ళే తాగమని చెప్పాలని , ఎమ్మెల్యే , ఎంపీ , ముఖ్యమంత్రి ఇలా ఎవరొచ్చినా ఈ నీళ్ళు ఇస్తేనే సమస్య పరిష్కారమవుతుంది అని పవన్ పేర్కొన్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments