ప్రభుత్వ పాఠశాలలో చేరేందుకు బారులు …

519

ఎక్కడైనా  ప్రైవేటు స్కూల్స్ లో తమ పిల్లలని చేర్చేందుకు తల్లితండ్రులు పోటీ పడడం చూస్తుంటాం , కానీ ఇక్కడ ఓ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు తల్లి తండ్రులు తమ పిల్లలతో కలిసి ఆందోళన చేశారు . ఇదెక్కడో అనుకోకండి , మన భాగ్యనగరంలోనే ఈ సంఘటన జరిగింది . వివరాలలోకి వెళితే వేసవి సెలవుల అనంతరం శుక్రవారం పాఠశాలలు పునఃప్రారంభం అయ్యాయి . రాష్ట్ర అవతరణ దినోత్సవం నేపధ్యంలో వేసవి సెలవులు ముందుకు జరిగాయి . వార్షిక విద్యా ప్రణాళికలను ఖరారు చేసిన ప్రభుత్వం.. సర్కారు బడుల్లో బడిబాటకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలోనే జూన్‌ 1 నుంచే పాఠశాలలు ప్రారంభించాలని నిర్ణయించింది.

ఈ క్రమమంలో రాజ్ భవన్ ప్రభుత్వ పాఠశాల ఈరోజు ప్రారంభమైంది . దీనితో అడ్మిషన్ ల కోసం తల్లితండ్రులు స్కూల్ వద్ద బారులు తీరారు . అయితే అపటికే అడ్మిషన్లు పూర్తి అయ్యాయని స్కూల్ యాజమాన్యం వెల్లడించడంతో పాఠశాల ప్రారంభమైన మొదటి రోజునే అడ్మిషన్లు ఎలా పూర్తి అవుతాయంటూ తల్లితండ్రులు ఆందోళన చేపట్టారు . దీంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది . తల్లితండ్రులకు నచ్చచెప్పేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తోంది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here