వైవిధ్యభరితమైన కధలను ఎంపిక చేసుకునే యంగ్ హీరోలలో నిఖిల్ సిద్ధార్థ్ ఒకరు . ఈ ఏడాది కిరాక్ పార్టీ తో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు , కానీ ఆ సినిమా ఆశించినంత విజయం సాధించలేకపోవడంతో తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టారు . ప్రస్తుతం నిఖిల్ తమిళ్ లో విజయం సాధించిన కనితన్ మూవీ తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసినదే .

శుక్రవారం నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను చిత్రయూనిట్ రెవీల్ చేసింది . ఈ చిత్రానికి ముద్ర అని టైటిల్ పెట్టారు . ఈ చిత్రం లో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి నటిస్తోంది . ఈ చిత్రం ఫస్ట్ లుక్ చూస్తుంటే ఇది జర్నలిజం బ్యాక్ డ్రాప్ లో జరిగే కధలా కనిపిస్తోంది . టీ . ఎస్ . సంతోష్ దర్సకత్వం వహిస్తున్న ఈ సినిమాని ఆరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ , మూవీ డైనమిక్స్ ఎల్.ఎల్.పి పతాకాలపై కావ్య వేణుగోపాల్ , రాజకుమార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు .

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments