ఇటీవల వెల్లడైన పలు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై అంధ్ర ప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు . ఈ సందర్భంగా ఈ ఎన్నికల ఫలితాలు భవిష్యత్తులో బీజేపీ ఎదురుకొనే పరిస్థితులను తెలియజేస్తున్నాయని ఆయన అన్నారు . బీజేపీ ఆదిపత్య ధోరణి , చేస్తోన్న ద్రోహం , దుష్పరిపాలన వల్లే ఇటువంటి ఫలితాలు వచ్చాయని స్పష్టం చేశారు . దక్షిణాదిలో బీజేపీ గురుంచి ఆలోచించే అవసరం లేదని , ఆ పార్టీ ఉత్తరాదిన కూడా మొహం చూపించలేని పరిస్థితి వస్తుందన్నారు . ఇకనైన బీజేపీ ఏపీ నేతలు మేల్కొని , ఏపీకి నిధుల కేటాయింపుపై అసత్య లెక్కలు చెప్పడం మానేసి , రాష్ట్ర హక్కులపై పోరాడాలని పేర్కొన్నారు .

 

 

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments