తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు బయోపిక్ ట్రెండ్ నడుస్తోంది . ఇప్పటికే సావిత్రి బయోపిక్ మహానటి విడుదలై విజయం సాధించగా ఏపీ మాజీ ముఖ్యమంత్రులు  ఎన్ టీ రామారావు , వై ఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్ లు రూపొందుతున్నాయి . అయితే మహా నటుడైన అక్కినేని నాగేశ్వరరావు బయోపిక్ కూడా తెరకేక్కనున్నట్లు ఫిలిం నగర్ వర్గాలలో వార్తలు వస్తున్నాయ్ . ఈ విషయం పై నాగార్జున ఆఫీసర్ మూవీ ప్రచార కార్యక్రమంలో క్లారిటీ ఇచ్చారు . నాగార్జున మాట్లాడుతూ అక్కినేని నాగేశ్వరరావు బయోపిక్ గురుంచి వస్తున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు .

ఈ విషయం పై నాగార్జున మాట్లాడుతూ ఏఎన్ఆర్ బయోపిక్ తీద్దామని గతంలో ఒకరు సంప్రదించారని , కానీ నాన్నది అందమైన జీవితం , ఎందరికో ఆదర్శమని అన్నారు . ఆనందంగా, సాదా సీదాగా ఉండే ఆయ‌న జీవిత నేప‌థ్యంలో సినిమా తీస్తే అందరికి నచ్చుతుందా?.. మనవాళ్లకి కాస్త నెగటివిటీ ఉండాలి. అవి లేక‌పోతే సినిమాలు ఆడ‌వు కదా. కెరీర్‌లో ఒడిదుడుకులు, ఎత్తు ప‌ల్లాలు, గొడవలు ఉండాలి కానీ అవేవీ ఆయనకు లేవు. నాన్న జీవితంపై బ‌యోపిక్ కన్నా పుస్తకం తీసుకువస్తే బావుంటుందేమో’ అంటూ చెప్పుకొచ్చారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments