కర్ణాటక మంత్రివర్గ కూర్పుపై కాంగ్రెస్-జేడీఎస్‌ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన విషయం తెలిసిందే. మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం పెట్టుకున్న సదరు నేతలు ఈరోజు తమ రాష్ట్ర గవర్నర్‌ వాజూబాయ్ వాలాను కలిసి ఈ విషయంపై చర్చించారు. అనంతరం ముఖ్యమంత్రి కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ… మంత్రివర్గ విస్తరణ ఈనెల 6వ తేదీన ఉంటుందని, అసలు వచ్చే ఆదివారమే జరపాలని అనుకున్నప్పటికీ ముందస్తు షెడ్యూల్ ప్రకారం గవర్నర్ ఢిల్లీ వెళ్తున్నారని తెలిపారు. ఈనెల 5వ తేదీన ఉదయం గవర్నర్ వస్తారని అన్నారు.

అనంతరం ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర మీడియాతో మాట్లాడుతూ… ఈనెల 6న మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని, ఆ తరువాత సుపరిపాలన కొనసాగించబోతున్నామని చెప్పారు. మంత్రివర్గ కూర్పు విషయంలో తాము కలిసే నిర్ణయం తీసుకున్నామని అన్నారు. రాష్ట్రంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం సజావుగా ముందుకు వెళ్లడమే ముఖ్యమని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here