జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోరాట యాత్ర నేడు 10 వ రోజుకు చేరుకుంది . నిన్న విజయనగరం జిల్లా పార్వతీపురం , బొబ్బిలి లో పర్యటించిన పవన్ నేడు సాలూరు , గజపతినగరం నియోజికవర్గాలలో తన యాత్ర కొనసాగిస్తారు . ఈరోజు జనసేనాని షెడ్యూల్ ఈ విధంగా ఉంది

ఉదయం బొబ్బిలి నియోజికవర్గంలో ఉన్న ప్రజలతో సమావేశమై అక్కడ ఉన్న సమస్యల గురుంచి తెలుసుకుంటారు . స్థానిక కార్యకర్తలతో సమావేశమై పార్టీ బలోపెతంపై చర్చలు జరుపుతారు .

తరువాత బయలుదేరి సాలూరు చేరుకొని మధ్యాహ్నం 2 గంటలకు బోసు బొమ్మ జంక్షన్ లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు ,

సభ ముగిసిన తరువాత అక్కడి నుండి బయలుదేరి గజపతినగరం చేరుకొని సాయంత్రం 4 గంటలకు స్థానిక 4 రోడ్స్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ ప్రసంగిస్తారు .

సభల మధ్యలో జనసైనికులతో , అభిమానులతో కలిసి నిరసన కవాతులో పవన్ పాల్గొంటారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments