బెజవాడ దుర్గమ్మ గుడిలో వివాదం రాజుకుంది. దుర్గగుడి కేశఖండన శాలలో పనిచేస్తున్న క్షురకుడు ఓ భక్తుని నుంచి పది రూపాయలు తీసుకున్నట్లు గమనించిన పాలకమండలి సభ్యుడు పెంచలయ్య ఆ క్షురకుడిని ప్రశ్నించాడు. భక్తులు ఇష్టపూర్వకంగా ఇస్తే తప్పేం లేదని క్షురకుడు చెప్పిన సమాధానంతో పాలకమండలి సభ్యుడు పెంచలయ్య కోపంతో ఊగిపోయి క్షురకుడి చొక్కాపట్టుకొని దుర్భాషలాడి, దాడి చేశాడట. దీంతో పాలకమండలి సభ్యుని వైఖరిని నిరసిస్తూ క్షురకులు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. కాగా ఈ ఘటనపై దుర్గగుడి అసిస్టెంట్ ఈవో అచ్యుతరామయ్య క్షురకులతో చర్చలు జరుపుతున్నారు.