మన దేశంలో అవినీతిపరులు బినామీదారుల వద్ద భారీగా నల్లదనం దాచుకుంటున్న విషయం తెలిసినదే . వీరి భరతం పట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త ఉపాయం తో ముందుకు వచ్చింది . బినామీదారులకు సంబంధించిన వివరాలు అందిస్తే ఏకంగా కోటి రూపాయలు ఇస్తామని ఆదాయ పన్ను శాఖ ప్రకటన చేసింది . దీనికి “బినామీ లావాదేవీల సమాచార రివార్డు పధకం” అని పేరు పెట్టింది . అలాగే , సమాచారం అందించిన వ్యక్తుల వివారాలు తాము బహిర్గతం చేయబోమని , పైగా వారికి భద్రత కూడా కల్పిస్తామని తెలిపింది .

అయితే బినామీదారులకు సంబంధించిన పూర్తిగా సరైన వివరాలు ఇవ్వాలని పేర్కొంది . బినామీదారుల వివరాలు ఎవరైనా చెప్పదలుచుకుంటే మొదట ఏదైనా ఆదాయపు పన్ను శాఖ కార్యాలయానికి వెళ్లి ఫాం ను నింపాల్సి ఉంటుంది . అందులో సమాచారం అందించే వారి పూర్తి వివరాలు ఇవ్వవలసి ఉంటుంది , అలాగే బినామీదారుడి వివరాలను అతడు ఎలా తెలుసుకున్న విషయాలను కూడా క్లుప్తంగా వెల్లడించాల్సి ఉంటుంది .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments