చేసినవి కొన్ని సినిమాలే అయినా అందరికీ ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాలు చేశారు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి . ఇటీవలే ఎన్టీఆర్ బయోపిక్ దర్శకుడిగా ఎంపికయ్యి లక్కీ ఛాన్స్ కొట్టారు . ఇప్పుడు ఈయన వ్యక్తిగత జీవితం గురుంచి ఒక వార్త చక్కర్లు కొడుతోంది . ఈయన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా షూటింగ్ మధ్యలో విరామం తీసుకొని ఆగష్టు 7 , 2016 న పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న విషయం తెలిసినదే . అయితే ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారం దర్శకుడు క్రిష్ విడాకులకు దరఖాస్తు చేసినట్టు తెలుస్తోంది . పెళ్లి అయ్యి రెండేళ్ళు కూడా కాకుండానే ఈ నిర్ణయం పై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి .

అయితే ఇంకొక విషయం ఏమిటంటే ఈ విడాకులకు గల కారణం ఒక హీరోయిన్ అని తెలుస్తోంది . దర్శకుడు క్రిష్ , కంచే హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కొన్ని నెలలుగా ముంబై లో డేటింగ్ చేస్తున్నారని , ఈ విషయం తెలిసి క్రిష్ భార్య రమ్య ప్రశ్నించడంతో మనస్పర్ధలు వచ్చాయని అందువల్లనే విడాకులు కోరుతున్నారని సమాచారం . క్రిష్ , రమ్య పరస్పర అంగీకారంతోనే విడాకులకు దరఖాస్తు చేసారని మరొక సమాచారం . అయితే ఈ విషయం పై దర్శకుడు క్రిష్ ఇంకా స్పందించలేదు . మరి ఇందులో ఎంతవరకు నిజముందనేది వేచి చూడాలి .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments