ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి లో మీడియా సమావేశంలో పాల్గొన్నారు . ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జాతీయ రాజకీయాల పరిస్థితులు , పరిమితులు తనకు తెలుసని , తాను అందరిలా జాతాయ రాజకీయాలో కుప్పిగంతులు వేయనన్నారు . దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు బలోపేతమవుతున్నాయని , ఆయా పార్టీలు జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు .

ఓ పార్టీకి ప్రజలు అధికారం ఇచ్చాక, అది వారి ఆకాంక్షలను నెరవేర్చకపోతే ప్రజలు దానిపై నమ్మకాన్ని కోల్పోతారని చంద్రబాబు అన్నారు. ఎన్డీఏ విషయంలో అదే జరుగుతోందని అన్నారు. కర్ణాటకలో అధికారం కోసం బీజేపీ చట్టవ్యతిరేకంగా ప్రవర్తించిందని, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించిందని అన్నారు. తాజాగా విడుదలైన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి ప్రజల సెంటిమెంట్‌కు ప్రతిబింబంగా నిలిచిందని వ్యాఖ్యానించారు.

దేశ శ్రేయస్సు కోసం అన్ని పార్టీలు కలిసి పనిచేయాల్సి ఉందని చంద్రబాబు అన్నారు. తాను జాతీయ రాజకీయాల అంశంలో ఎప్పుడేం చేస్తానో ప్రజలే చూస్తారని పేర్కొన్నారు. ఏపీకి కాంగ్రెస్‌ కంటే ఎక్కువ అన్యాయం బీజేపీనే చేస్తోందని ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యేల రాజీనామాలను ఎందుకు ఆమోదించడం లేదని ప్రశ్నించారు. వెంటనే ఆమోదిస్తే ఉప ఎన్నికలు వస్తాయన్న ఉద్దేశంతో కుట్ర పన్నుతున్నారని అన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments